Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో అనసూయ అన్నీ చూపించినా బయట ఆ పనికి ముసుగేసుకుంటుందట!

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (16:00 IST)
Anasuya
సినిమాల్లో వాంప్‌ పాత్రలు వుండేవి ఒకప్పుడు. ఇప్పుడు హారోయిన్లు చాలా బోల్డ్‌గా చేసేస్తున్నారు. రానురాను నటి అనసూయ కూడా చాలా బోల్డ్‌గా సోషల్‌మీడియాలో వున్నట్లే సినిమాల్లోనూ రకరకాల పాత్రలు చేసి యూత్‌ను అలరిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో మోకాళ్ళవరకు చీరను కట్టి రామ్‌చరణ్‌ను ఒడిలో చేర్చుకుని నటించి గిలిగింతలు పెట్టించింది. ఇక ఇటీవలే విమానం అనే సినిమాలో వేశ్యగా నటించి తన అందాలను మరింతగా చూపించింది. తాజాగా పెదకాపు1 సినిమాలో నటించింది. ఈ సందర్భంగా బోల్డ్‌ పాత్రలు చేస్తున్నారు మీకేమి ఇబ్బంది అనిపించడంలేదా? అంటే ఆమె ఇలా సమాధానం చెప్పింది.
 
ఏదైనా క్యారెక్టర్‌ను బట్టి వుంటుంది. ఇస్లాంను ఫాలో అయ్యేవారు చేతులు చూపిస్తే బోల్డ్‌ అంటారు. ఒక్కోచోట హ్యాఫ్‌ హ్యాండ్ చూపిస్తారు. కొందరు స్లీవ్‌లెస్‌గా కనిపిస్తారు. విదేశాల్లో అయితే అన్నీ చూపించినా బోల్డ్‌ అనరు. కల్చర్‌ను బట్టి పరిస్థితులు మారుతుంటాయి.
 
విమానంలో వేశ్య పాత్ర కథకు  మలుపు తిప్పేది కనుక ఆ క్యారెక్టర్‌అలా చేయాల్సిందే. ఆ క్యారెక్టర్‌కు ఎమోషన్స్‌ వుంటాయి. ఎందకు అలా చేశాను అనేది చివరిలో తెలుస్తుంది. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఓన్‌ చేసుకుని చేస్తారు. నాకు సినిమాలంటే ఇష్టం. నా అనుభవంలో సినిమాలు చేస్తూ అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా కోరిక. ఇక చూసేవారిని బట్టి ఆ పాత్ర స్వభావం వుంటుంది అని తెలిపింది.
 
అసలు నేను బయట ఎలా వుంటానో తెలుసా! మా వారు బీహార్‌ ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళినప్పుడు మొహం కనిపించకుండా కొంగు కప్పుకోవాల్సివుంటుంది. అన్నం తినేటప్పుడు కొంగుచాలున తినాల్సిందే. మొదట్లో. అది నాకు కొత్తగా అనిపించేది. అందుకే ప్రతివారిని గౌరవించాలి. నా కుటుంబ ఫంక్షన్‌లో తగినట్లు ప్రవర్తిస్తుంటాను అని క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments