Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ బరువు 21 గ్రాములే అంటున్న యంగ్ హీరో..

''స్వామిరారా'', ''కార్తికేయ'', ''సూర్య వర్సెస్ సూర్య'' వంటి సినిమాల హిట్‌తో మాంచి ఊపుమీదున్న హీరో నిఖిల్. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త కథనంతో ముందుకు రాబోతున్నాడు. ''ఎక్కడికి పోతావు చిన్నవాడా..''తో ప్ర

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (11:48 IST)
''స్వామిరారా'', ''కార్తికేయ'', ''సూర్య వర్సెస్ సూర్య'' వంటి సినిమాల హిట్‌తో మాంచి ఊపుమీదున్న హీరో నిఖిల్. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త కథనంతో ముందుకు రాబోతున్నాడు. ''ఎక్కడికి పోతావు చిన్నవాడా..'' తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ''మరణం దేహానికే కానీ ఆత్మకు కాదని భగవద్గీత చెబుతుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్‌ చెబుతుంది. 
 
అంటే 21 గ్రాముల బరువు.. ప్రేమ..? సంతోషం..?, పగ..? బాధ..? ఇవన్నీ కొలువై మరణానంతరం శరీరాన్ని విడిచి వెళ్లే ఆత్మ'' అని ఆత్మకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్‌. మనిషి చనిపోయాక 21 గ్రాముల బరువు తగ్గుతాడు అంటూ ఓ ఆత్మ కాన్సెప్ట్‌తో భయపెట్టబోతున్నాడు. వి.ఐ.. ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీవీఆర్ సంస్థ నిర్మించింది. 
 
నవంబరులో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో నిఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. స్వామిరారా తర్వాత వైవిధ్యమైన కథలతో ప్రయాణం కొనసాగిస్తోన్న నిఖిల్‌కు ఇది మరో విజయాన్నిఅందిస్తుందని సినీ నిపుణులు అంటున్నారు. ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌, నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments