Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్, డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (20:11 IST)
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ మనం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన మనం అక్కినేని హీరోల కెరీర్ లోనే కాకుండా... తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా నాగ్ మరోసారి ట్రెండ్ సెట్టర్ అయ్యారు.
 
అయితే... నాగార్జున - అఖిల్ కాంబినేషన్లో మల్టీస్టారర్ స్టార్ట్ రానుందని... ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారని తెలిసింది.
 
 ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి నాగ్ - అఖిల్ కాంబినేషన్లో మూవీ చేయనున్నారని... ఇటీవల నాగ్‌ని కలిసి కథ చెప్పారని తెలిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.... అక్కినేని ఫ్యామిలీ సినిమా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది.
 
ఈ చిత్రానికి చిలసౌ, మన్మథుడు 2 చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ రెడీ చేసాడని.. అన్నీ కుదిరితే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే... ఇది కేవలం గాసిప్ మాత్రమేనా...? లేక నిజమేనా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments