Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర డిప్రెషన్‌లో వున్న శ్రీను వైట్ల... ఎవ్వరూ పట్టించుకోవడంలేదట.. ఇంట్లో కూర్చుని...

సినీ ఇండస్ట్రీలో ఆటుపోట్లను ఎదర్కున్నవారే రాణిస్తారు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కూడదు. ఐనా సినీ ఇండస్ట్రీలో పట్టింపులు ఎక్కువ. ఒకసారి స్టార్ సెలబ్రిటీ హోదా వచ్చాక, ఆ స్థానం మళ్లీ తిరోగమనం వైపు వెళ్లిపోతుంటే సహిం

Webdunia
సోమవారం, 29 మే 2017 (14:46 IST)
సినీ ఇండస్ట్రీలో ఆటుపోట్లను ఎదర్కున్నవారే రాణిస్తారు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కూడదు. ఐనా సినీ ఇండస్ట్రీలో పట్టింపులు ఎక్కువ. ఒకసారి స్టార్ సెలబ్రిటీ హోదా వచ్చాక, ఆ స్థానం మళ్లీ తిరోగమనం వైపు వెళ్లిపోతుంటే సహించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితి ఇపుడు టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లకు వచ్చిందట. ఇటీవలే మెగా ఫ్యామిలీ హీరో మిస్టర్ అట్టర్ ప్లాప్ కావడంతో పరిస్థితి తలకిందులైందంటున్నారు. 
 
ఈ అపజయంతో శ్రీను వైట్ల తన ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. మరోవైపు ఆయన కథ చెపుతానంటే కనీసం చిన్న హీరో కూడా పట్టించుకోవడంలేదట. దీంతో ఆయన తీవ్రమైన డిప్రెషన్లో వున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. సినీ ఫీల్డులో ఆయనకు మిత్రులు కంటే శత్రువులే ఎక్కువ వున్నట్లు ప్రచారంలో వుంది. దీనితో ఆయన్ను కష్టాల నుంచి ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదట. 
 
ఐతే ఇప్పటికైనా కెరీర్ మొదట్లో పడిన కష్టాలను దృష్టిలో పెట్టుకుని మంచి కథతో మళ్లీ ముందుకు వెళితే తప్పక సక్సెస్ వస్తుందంటున్నారు ఆయన సన్నిహితులు. అలాగే డిప్రెషన్లో పడ్డ శ్రీను వైట్లకు సన్నిహితులే కౌన్సిలింగ్ ఇస్తూ ధైర్యవచనాలు చెపుతున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments