Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే వారం దిల్ రాజుకు డబ్బింగ్ సినిమాల సెగ వుంటుందా?

డీవీ
బుధవారం, 27 మార్చి 2024 (19:15 IST)
goat,famiysat, anjuman
ఆ మధ్య సంక్రాంతి సినిమాల రిలీజ్ లలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు పోటీపడితే గుంటూరు కారంకు నైజాం పంపిణీదారుడు దిల్ రాజు పెద్దగా థియేటర్లు ఇవ్వలేదు. పైగా చిన్న హీరో సినిమా అంటూ దాటవేశాడు. కానీ అది విడుదలయి పెద్ద రేంజ్ లోకి వెళ్ళింది. తాజాగా ఇప్పుడు మార్చి 5 వ తేదీన మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ వుంది. మిగిలిన గోట్ లైఫ్, ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'మంజుమ్మెల్ బాయ్స్' అనే మలయాళ సినిమాలు వున్నాయి. ఈ రెండింటిని మైత్రీమూవీస్ విడుదలచేస్తోంది.
 
కాగా, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు పెద్దగా లేవనే టాక్ నెలకొంది.  ఆల్ రెడీ నాలుగేల్ళ నుంచి కష్టపడుతూ ప్రుధ్వీరాజ్ గోట్ లైఫ్ తీసి తన కెరీర్ ను పణంగా పెట్టుకుని చిరంజీవి సినిమాలు కూడా వదులుకున్నాడు. అందుకే తెలుగులో మైత్రీమూవీస్ వారితో చేతులు కలిపి రిలీజ్ చేసుకుంటున్నాడు. త్వరలో ఆయన మైత్రీ మూవీస్ లో ఓ సినిమా కూడా చేయబోతున్నాడు.
 
ఇక రెండో డబ్బింగ్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్' యూత్ సినిమా. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చిపెట్టింది. దీనిని యూత్ బాగా కనెక్ట్ అవుతారని మైత్రీ మూవీస్ రవి తెలియజేస్తున్నారు. ఇక నైజాంలో అగ్ర పంపిణీదారుడు దిల్ రాజు మాత్రం సెంటిమెంట్ సినిమాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. దాంతో థియేటర్లు తగ్గడంతో కొద్దిపాటితో మైత్రీ మూవీస్ పరిమితం అవుతుంది. చిత్రంలోని కంటెంట్ కొత్తదనం  వుంటే ఇప్పటి యూత్ డబ్బింగ్ సినిమాలకే ఎగబాడతారని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏమి అవుతుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments