Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ఫ్యామిలీ స్టార్ కు అసలైన అర్థం చెప్పిన ప్రొడ్యూసర్ దిల్ రాజు

Advertiesment
Dil Raju -vijay

డీవీ

, శనివారం, 23 మార్చి 2024 (09:03 IST)
Dil Raju -vijay
స్టార్ హీరో విజయ్ దేవరకొండతో "ఫ్యామిలీ స్టార్" సినిమాను నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆయన ఇవాళ వెల్లడించారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఐడీ, హెల్త్ కార్డ్, డైరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ గురించి ఇప్పటిదాకా రివీల్ చేయని ఓ విషయాన్ని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ స్టార్ గా చూపించేందుకు చేసిన సినిమా కాదని, ఒక ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని దిల్ రాజు చెప్పారు.
 
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ - ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్ గా చూపించేందుకు చేస్తున్న సినిమా కాదు. ఇప్పటిదాకా నేను ఈ సినిమా గురించి చెప్పని విషయాన్ని ఈ వేదిక మీద రివీల్ చేస్తున్నా. మీరంతా ఎక్కడో ఉన్న మీ కుటుంబాలను గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. నేను, ఈ వేదిక మీద ఉన్న ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు, ఆర్ నారాయణమూర్తి గారు మేమంతా సాధారణ జీవితాలతో మొదలై మా రంగాల్లో కష్టపడి ప్రయోజకులై పైకి వచ్చాం. ఇవాళ మా కుటుంబాలకు ఈ సొసైటీలో ఒక పేరు దక్కేలా చేశాం. అలాంటి వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే ఫ్యామిలీ స్టార్ కథాంశం. అని అన్నారు.
 
విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్"  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర విడుదలకు సిద్ధం