Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ప్ర‌యోగం ఫ‌లించిందా! అభిమానులు ఏం చెప్పారంటే!

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (12:04 IST)
The Ghost
కెరీర్‌లో ఒక్కోసారి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజ‌యాలు, అప‌జ‌యాలు చూస్తుంటారు క‌థానాయ‌కులు. నాగార్జున త‌ర‌చూ ప్ర‌యోగాలు చేస్తూనే వుంటారు. మాస్‌, డాన్‌, మ‌నం, బంగార్రాజు వంటి క‌థ‌ల‌తో వైవిధ్యాన్ని చేస్తూనే మ‌రో వైపు యాక్ష‌న్ క‌థ‌ల‌పై కాన్‌స‌న్ ట్రేష‌న్ చేస్తున్నాడు. అందులో భాగంగా వైల్డ్ డాగ్ సినిమా చేశాడు. అది అంత పెద్ద‌గా విజ‌యాన్ని సాధించ‌క‌పోయినా ప్ర‌యోగం చేశాడ‌ని ప్రేక్ష‌కులు తీర్పు ఇచ్చారు. ఈ సినిమాకు చిరంజీవి బాగా ప్ర‌మోట్ చేశారు.
 
ఇప్పుడు తాజాగా చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌తోపాటు నాగార్జున ది ఘోస్ట్ కూడా విడుద‌లైంది. కానీ ది ఘోస్ట్ అన్ని ప్రాంతాల నుండి డల్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నిచోట్ల ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు లేరు. గ‌రుడ వేగ తీసిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌రికొత్త‌గా వుంటుంద‌ని చెప్పినా అర్థంప‌ర్థంలేని యాక్ష‌న్‌లు, బిలియ‌ర్ కుటుంబంలో జ‌రిగే క‌థ కావ‌డంతో సామాన్యుడికి పెద్ద‌గా ఎక్క‌లేద‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.
 
అందుకే అభిమానులు కూడా నాగార్జున త‌గు సూచ‌న‌లు చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. స‌ర‌దాగా ఎంట‌ర్‌టైన్ చేసే సినిమాలు చేయ‌మ‌ని సూచించిన‌ట్లు అభిమాన సంఘాల‌నుంచి నివేదిక వ‌చ్చిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ఎలాగూ టీవీ షో బిగ్‌బాస్‌లో వున్నా స‌రికొత్త‌గా ఓటీటీలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ది ఘోస్ట్ రిజ‌ల్ట్‌తో సంబంధంలేకుండానే కొంత‌కాలం న‌ట‌న‌కు గ్యాప్ తీసుకుంటాన‌న్న నాగార్జున ఈసారి అభిమానుల సూచ‌న‌లు పాటిస్తారోలేదో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments