Webdunia - Bharat's app for daily news and videos

Install App

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

దేవీ
శనివారం, 12 ఏప్రియల్ 2025 (20:15 IST)
Bhaskar, Siddu
బొమ్మరిలు, ఆరెంజ్ సినిమాల దర్శకుడు భాస్కర్ కొంత గేప్ తీసుకుని జాక్ సినిమా తీశాడు. సిద్దు జొన్నలగడ్డతో రూపొందించిన ఈ సినిమా పూర్తిఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందని రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్ చేశారు. అసలు పాయింట్ అనేది దాచేసి వినోదం అంటూ చెప్పారు. అయితే విడుదల తర్వాత ఈ సినిమా సీరియస్ పాయింట్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. కానీ దాన్ని వినోదం చూస్తారనున్న దర్శకుడి అంచనా తారుమారుఅయింది.
 
 సినిమా మంచి హైప్ తో విడుదలైనా దురదృష్టవశాత్తు, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు అమెరికాలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మొదటి మరియు రెండవ రోజుల కలెక్షన్లు రికార్డు స్థాయిలో తగ్గాయి, సిద్ధు తన ప్రజాదరణ పొందినప్పటికీ థియేటర్లకు ఎలాంటి ప్రేక్షకులను రప్పించుకోలేకపోవడాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
 
ఇదంతా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ వల్ల జరిగింది. ఆయన కథ,  కథనాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అసలు టెర్రరిజం పాయింట్ ను ఎంచుకోవడమే పెద్ద తప్పిదంగా అనిపిస్తుంది. ఈ పాయింట్ ను సిల్లీగా చూపించడం ప్రేక్షకులకు మింగుపడలేదు. కథనం  నిరాశపరిచే విధంగా రూపొందించారు. సోషల్ మీడియాలో  దర్శకుడి పై భారీ ట్రోల్స్ వస్తున్నాయి.
 
ఈ సినిమా చూసిన వారందరూ సిద్ధు ఇంత చిన్న సినిమాకి ఎందుకు ఓకే చెప్పాడనే దాని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. జాక్ 'రా' ఏజెంట్ల గురించి,  వారిని ప్రదర్శించిన విధానం ప్రేక్షకులపై పెద్ద జోక్‌గా ముగుస్తుందనే రిపోర్ట్ లు వస్తున్నాయి. ట్విస్ట్ ఏమంటే, ఈ సినిమాకు మరో రెండు కథలు సీక్వెల్ తీయాలనుందని భాస్కర్ విడుదలకు ముందు చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments