తెలంగాణాలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురింసింది. ఇక రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీచేసింది.
కాగా, గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీమ్, అసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.
శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, జనగాం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.