Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా అది చూపించాలనే ఒప్పేసుకుందట !!

దీపికా పదుకునే హాలీవుడ్‌లో ట్రిపుల్ ఎక్స్ సినిమా చేస్తుంది. ఇది ఓ యాక్షన్ మూవీ. హాలీవుడ్‌లో ట్రిపుల్ ఎక్స్ సిరీస్‌లో వచ్చిన సినిమాలు చాలా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా నటించిన విన్ డీజిల్

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:50 IST)
దీపికా పదుకునే హాలీవుడ్‌లో ట్రిపుల్ ఎక్స్ సినిమా చేస్తుంది. ఇది ఓ యాక్షన్ మూవీ. హాలీవుడ్‌లో ట్రిపుల్ ఎక్స్ సిరీస్‌లో వచ్చిన సినిమాలు చాలా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా నటించిన విన్ డీజిల్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ మధ్య సౌత్ ఏషియా మార్కెట్ మీద కన్నేసిన హాలీవుడ్ ఫిలిం మేకర్స్ మన ఇండియన్ ఆర్టిస్టులకు కీలకమైన పాత్రలు ఆఫర్ చేస్తున్న సంగతితెలిసిందే.
 
ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీపిక తన ట్విట్టర్ ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. డీజే క్యారుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్డీజిల్తో పాటు నీనా డోబ్రేవ్, రూబీ రోజ్‌లు నటించారు. ఈ చిత్రంలో దీపికా తన అందాన్ని హద్దులు లేకుండా చూపించింది. ఈ చిత్రంతో పాటు ద రిటర్న్‌ ఆఫ్‌ ఎక్స్‌ జాండర్‌ కేజ్‌' అనే భారీ చిత్రంలో కూడా నటిస్తోంది. చేసే పనిలో సంతృప్తి వెతుక్కునే తత్వమున్న ఈ బ్యూటీ హాలీవుడ్‌లో డిమాండ్‌ మేరకు బాగా హాట్‌హాట్‌‌గా కనిపిస్తోంది. 
 
ఈ మధ్య విడుదల చేసిన 'ట్రిపుల్‌ ఎక్స్‌, ద రిటర్న్‌ ఆఫ్‌ ఎక్స్‌ జాండర్‌ కేజ్‌' ట్రైలర్‌‌లో దీపికా పదుకొనే ఇప్పటిదాకా కనిపించనంత బోల్డ్‌‌గా కనిపించింది. గ్లామర్‌‌తో పాటు ప్రమాదకరమైన అమ్మాయిగా ఈ చిత్రంలో దీపికా నటిస్తోంది. మోడలింగ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ సాగిన ప్రయాణంపై దీపికా స్పందిస్తూ తాను చేస్తున్న పనిపై పూర్తి సంతృప్తి వ్యక్తంచేసింది.

సరైన సమయంలోనే తనకు హాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని వ్యాఖ్యానించింది. యాక్షన్ పిక్చర్‌లో నటించాలన్న ఉత్సాహంతోనే... తన నటనను చూపించాలనే.... ఈ సినిమా ఒప్పేసుకున్నానని చెప్పింది. జనవరి 20, 2017లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments