Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన సురేందర్ రెడ్డి.. రూ.13 కోట్ల ఆఫర్ ఎలా వదులుకునేది!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్‌' చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో తన తదుపరి చిత్రంపై యంగ్ టైగర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో తనతో 'అశోక్'‌, 'ఊసరవెల్లి' తీసిన సురేందర్‌‌తో ఓ సినిమా చేయ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (15:12 IST)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్‌' చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో తన తదుపరి చిత్రంపై యంగ్ టైగర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో తనతో 'అశోక్'‌, 'ఊసరవెల్లి' తీసిన సురేందర్‌‌తో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడట. అయితే సురేందర్ రెడ్డి మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు నో చెప్పాడట. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తానంటే... ఏ దర్శకుడు కూడా వద్దనడు. కానీ, సురేందర్ రెడ్డి మాత్రం నో చెప్పాడట. అందుకు కారణం కూడా లేకపోలేదు. 
 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ సినీ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతని తొలి చిత్రం 'జాగ్వార్' రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా పరాజయం కావడంతో... రెండో సినిమాపై నిఖిల్ దృష్టి సారించాడు. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఏకంగా రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ చిత్ర నిర్మాతలు బంపర్ ఆఫర్ ప్రకటించారట. దీంతో, ఆ సినిమా చేయడానికి సురేందర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. 
 
ప్రస్తుతం, రాంచరణ్ నటిస్తున్న 'ధృవ' సినిమాతో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి... 2017 ప్రారంభంలో నిఖిల్ గౌడ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ కారణంగానే ఎన్టీఆర్ సినిమాను సురేందర్ రెడ్డి వదులుకున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్‌తో సినిమా ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అయినా పని చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిఖిల్‌ సినిమాకే దర్శకుడు మొగ్గుచూపుతున్నాడట. ఖచ్చితంగా సూరి దొరికేస్తాడని నమ్మకంగా ఉన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు మళ్లీ దర్శకుడి కోసం వేట మొదలుపెడుతున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments