Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది గౌతమి వ్యక్తిగత నిర్ణయం.. నాకు నా తల్లిదండ్రులు - అక్షరే ముఖ్యం : శృతిహాసన్

'లోకనాయకుడు' కమల్ హాసన్‌తో నటి గౌతమి దాదాపు 13 సంవత్సరాలు సహజీవనం చేసింది. నవంబర్ 1వ తేదీతో వీరి సహజీవనానికి తెరపడింది. కమల్ హాసన్ నుంచి విడిపోతున్నట్లు గౌతమి స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇది

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:50 IST)
లోకనాయకుడు' కమల్ హాసన్‌తో నటి గౌతమి దాదాపు 13 సంవత్సరాలు సహజీవనం చేసింది. నవంబర్ 1వ తేదీతో వీరి సహజీవనానికి తెరపడింది. కమల్ హాసన్ నుంచి విడిపోతున్నట్లు గౌతమి స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇది గుండెలు పగిలే సంఘటనగా గౌతమి పేర్కొంది. దీంతో సినీప్రపంచం మొత్తం షాక్‌కు గురైంది. 
 
తమ ఎడబాటుపై గౌతమి మాట్లాడుతూ.. ''నేను, కమల్ హాసన్ ఇక ఎక్కువ కాలం కలసి ఉండలేమన్న విషయం నాగుండేని చిదిమేస్తోందని, 13 ఏళ్ల తర్వాత నా జీవితంలో తీసుకుంటున్న భయంకర నిర్ణయం ఇది'' అని గౌతమి పేర్కొంది. కమల్ అంటే తనకు చాలా ఇష్టమని... ఆయన నుంచి విడిపోతుండటం తనకు చాలా బాధగానే ఉందని ఆమె తెలిపారు. తనకు జాలి పొందే ఉద్దేశం లేదని గౌతమి వ్యాఖ్యానించింది. తాను మొదట తల్లినని, సాధ్యమైనంత వరకు తన బిడ్డకు మంచి తల్లిగా ఉండటమే నాకు ముఖ్యమని గౌతమి పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే కమల్ గారాలపట్టి శృతి హాసన్‌కు గౌతమిల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ హాసన్‌తో గౌతమి విడిపోవడంపై శృతి హాసన్ స్పందించింది. ఇది వారిద్దరికీ సంబంధించిన విషయమని... ఇతరుల వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై తాను మాట్లాడనని...తనకు తన తల్లిదండ్రులు, చెల్లెలు అక్షర హాసన్‌లే ముఖ్యమని తేల్చి చెప్పింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments