Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' ఫంక్షన్‌కు పవన్ రావాల్సిందే.. పట్టువదలకుండా ప్రయత్నిస్తున్న చెర్రీ - సురేఖ

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం ప్రిరిలీజ్ ఫంక్షన్ ఈనెల 7వ తేదీన గుంటూరు వేదికగా జరుగనుంది. ఈ ఫంక్షన్‌లో అతిరథ మహారథులు పాల్గొననున్నారు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (14:58 IST)
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం ప్రిరిలీజ్ ఫంక్షన్ ఈనెల 7వ తేదీన గుంటూరు వేదికగా జరుగనుంది. ఈ ఫంక్షన్‌లో అతిరథ మహారథులు పాల్గొననున్నారు. కానీ, మెగా ఫ్యామిలీ హీరో, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం హాజరయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఇది మెగా ఫ్యాన్స్‌తో పాటు.. మెగా కాంపౌండ్‌ను కూడా తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. 
 
"చిరంజీవి 150వ చిత్రానికి పవన్ కల్యాణ్ రావడం లేదు"... అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పినప్పటికీ... "పవన్ కల్యాణ్‌ను తీసుకు వచ్చేందుకు స్వయంగా చిరంజీవి సతీమణి సురేఖ వెళ్లి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 
 
ఒకవేళ పవన్ రాకుంటే, అభిమానులు చేసే నినాదాలను అదుపు చేయలేమని మెగా ఫ్యామిలీ భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన్ను తీసుకురావాలని పలువురు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ వేడుకకు తాను రానవసరం లేదని పవన్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. అయితే, పవన్ రాకపై మాత్రం ఉత్కంఠత నెలకొంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments