Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... చిరు సైరా మ‌ళ్లీ వాయిదా..? ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడు..?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (16:51 IST)
మెగాస్టార్ చిరంజీవి - స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందుతోన్న రూపొందుతోన్న భారీ చిత్రం సైరా న‌ర‌సింహా రెడ్డి. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రాన్ని మెగా పవర్‌‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. 
 
కొణెద‌ల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే... గ్రాఫిక్స్ వర్క్‌కి టైమ్ ఎక్కువ కావాలి అనే ఉద్దేశ్యంతో గాంధీ జయంతి రోజున అక్టోబ‌ర్ 2న‌ రిలీజ్ చేయాలని నిర్ణయించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సైరా అక్టోబర్‌లో కూడా రిలీజ్‌ కావటం కష్టమే అంటున్నారు. ఎంత స్పీడుగా వ‌ర్క్ చేసినా... గ్రాఫిక్స్‌ భారీగా ఉండటంతో అనుకున్న సమయానికి కంప్లీట్ కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట. 
 
అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోన్న సినిమా కావటంతో ప్రచార కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయం తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుచేత హడావిడిగా అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయ‌డం కన్నా... ప‌క్కా ప్లాన్‌తో బాగా ప్ర‌మోష‌న్స్ చేసి సినిమాను 2020 జనవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తపై సైరా టీమ్ స్పందిస్తుందేమో చూడాలి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments