Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజ భర్తలో హీరో లక్షణాలు.. త్వరలో ప్రొడక్షన్ హౌస్.. కళ్యాణ్ కూడా మెగా హీరో అవుతాడా?!

ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో మెగా హీరోలు తెగ సందడి చేస్తుంటే, ఇటీవలే మెగా హీరోయిన్‌గా నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది. చిరు పెద్ద కు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (15:37 IST)
ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో మెగా హీరోలు తెగ సందడి చేస్తుంటే, ఇటీవలే మెగా హీరోయిన్‌గా నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది. చిరు పెద్ద కుమార్తె సుష్మిత చిరు 150వ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఇలా తెలుగు ఇండస్ట్రీ అంతా మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. 
 
చిరంజీవి కొడుకు రాం చరణ్ తేజ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్, కూతుళ్ళు ఇలా అందరూ ఈ రంగంలో దూసుకుపోతుంటే… చిరు అల్లుడు, శ్రీజ‌ని పెళ్లి చేసుకున్న క‌ళ్యాణ్‌కి సినిమాలపట్ల ఆసక్తి ఉండడంతో మెగా ఫ్యామిలీ త‌రపున హీరోగా ఎంట‌ర్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. దీనికి ముంద‌డుగుగా త‌న భార్య శ్రీజ చేత ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా ప్రారంభించనున్నాడట. యు.ఎస్‌లో బిజినెస్ మ్యాన్ అయిన క‌ళ్యాణ్‌లో హీరో ల‌క్ష‌ణాలు చాలానే ఉండ‌టంతో ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ త‌న కూతురి భ‌ర్త‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేపనిలో ముమ్మరంగా ఉన్నారు.
 
అంతేకాకుండా కొద్ది రోజుల్లో మెగా ఫ్యామిలీ కొణిదెల ఫిల్మ్ సిటీ అంటూ ఓ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్ట‌నున్నార‌ట. హీరోలు, హీరోయిన్లు, డిజైన‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్, బ్యాన‌ర్ కంపెనీ, ఫిల్మ్ సిటీ ఇలా సినిమాకి కావ‌ల్సినవన్నీ మెగా ఫ్యామిలీలో ఉన్నాయంటూ సినీనిపుణులు అంటున్నారు. మొత్తానికి శ్రీజ భర్త కూడా మెగా హీరోగా అరంగేట్రం చేయనున్నాడనమాట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments