Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు.. మురుగదాస్ సినిమాకు వాస్కోడాగామా ఫిక్సైనట్టేనా..?

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేశ్ బాబు కథానాయకుడిగా నటి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (15:17 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మ‌హేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బ‌డ్జెట్ అంచ‌నా రూ.100 కోట్ల‌కు పైనే అని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. 
 
తెలుగు.. తమిళ భాషలలో ఈ సినిమాను తెరకెక్కించి, హిందీలోను విడుదల చేయాలనే ఆలోచనలో మురుగదాస్ ఉన్నాడు. కథ పూర్తిగా ముంబై నేపథ్యంలో కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థపై హీరో ఉక్కుపాదం మోపే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ తెలిపారు. అందుకే ఈ చిత్రానికి 'చట్టంతో పోరాటం' టైటిల్‌ని మొదట్లో అనుకున్నప్పుటికి ఇప్పుడు మరో టైటిల్‌ను అన్వేషించే ప‌నిలో ఉన్నారట యూనిట్ సభ్యులు. 
 
ఇప్ప‌టికే ప‌లు టైటిళ్లు ప్రచారంలోకి వ‌చ్చాయి. చ‌ట్టానికి క‌ళ్లు లేవు, ఎనిమీ, జ‌స్టిస్ వంటి ప‌రిశీల‌న‌లో ఉన్నాయి గానీ, ఇప్ప‌టివ‌ర‌కూ ఏదీ ఒక పట్టాన క‌న్ఫ‌మ్ కాలేదు. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర టైటిల్ వెలుగులోకి వ‌చ్చింది. ఆ టైటిల్‌కు మ‌హేష్ కూడా మొగ్గు చూపుతున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే... వాస్కోడాగామా. మ‌హేష్ వైపు నుండి ఈ టైటిల్‌కి గ్రీన్ సిగ్నల్ రావడంతో దీనికే ఫిక్స్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments