అందుకే... సురేంద‌ర్ రెడ్డికి చిరు వార్నింగ్ ఇచ్చార‌ట‌..!

Webdunia
బుధవారం, 1 మే 2019 (20:48 IST)
మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో న‌టిస్తున్నారు. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం గ‌త కొంతకాలం నుంచి షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు బ‌ర్త్ డేకి టీజ‌ర్ రిలీజ్ చేసారు కానీ... ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. 
 
 
దీనికితోడు సురేంద‌ర్ రెడ్డి బాగా లేట్ చేస్తున్నాడ‌ట షూటింగ్ స్పాట్లో. ఇలా అయితే... లాభం లేద‌నుకున్నాడో ఏమో కానీ.. చిరు సురేంద‌ర్ రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. మే నెలాఖ‌రుకి షూటింగ్ కంప్లీట్ చేయాలి అని డెడ్ లైన్ పెట్టార‌ట‌. ఈ మూవీని ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే... ఈ మూవీ త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల ఈ మూవీ స్ర్కిప్ట్ వ‌ర్క్ కంప్లీట్ చేసారు. 
 
ఇందులో సునీల్, అన‌సూయ ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో న‌టించే క‌థానాయిక విష‌యానికి వ‌స్తే.. శృతిహాస‌న్, త‌మ‌న్నా పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఇంకా ఎవ‌ర్నీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని స‌మాచారం. సందేశంతో పాటు వినోదంతో ఉండే ఈ విభిన్న క‌థా చిత్రాన్ని ఆగ‌ష్టు నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments