చిరు మరో మల్టీస్టారర్, మరో హీరో ఎవరో తెలుసా?

Webdunia
శనివారం, 9 మే 2020 (15:53 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఓ మల్టీస్టారర్. ఈ సినిమా తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ లోనటించనున్నారు.
 
ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కూడా ఓ మల్టీస్టారరే. అయితే.. ఇప్పుడు తాజాగా మరో మల్టీస్టారర్లో కూడా చిరు నటించనున్నారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే... లూసీఫర్ తర్వాత చిరంజీవి బాబీ డైరెక్షన్లో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు.
 
బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాబీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు. అయితే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరో కూడా ఉన్నాడట. ఇంతకీ.. మరో హీరో ఎవరంటే దగ్గుబాటి రానా అని సమాచారం. 
 
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి - రానా కాంబినేషన్లో రూపొందే భారీ మల్టీస్టారర్ కథ చాలా కొత్తగా ఉంటుందని.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉంటుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments