Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి లవ్ స్టోరీ స్టిల్ రిలీజ్.. బర్త్ డే కానుకగా అదుర్స్

Webdunia
శనివారం, 9 మే 2020 (14:08 IST)
Sai pallavi
భానుమతిగా ''ఫిదా''తో తెలుగు తెరకు పరిచయమైన సాయిపల్లవికి నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా లవ్ స్టోరీ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఫిదాకు తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేసేందుకు 'లవ్ స్టోరి'తో సిద్ధమవుతుంది సాయిపల్లవి.
 
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ క్రేజ్ లవ్ స్టోరీపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ''ఏయ్ పిల్లా'' సాంగ్‌కు విశేషమైన స్పందన లభించింది. లవ్ స్టోరీకి ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది. లాక్ డౌన్ తర్వాత అప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకుని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ నుంచి బర్త్ డే బేబీ సాయిపల్లవికి కానుకనిచ్చే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సాయి పల్లవి మరింత అందంగా కనిపించింది. వర్షంలో ఆడుతున్న స్టిల్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తుంది. కామెంట్లు, లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విరాట పర్వం సినిమా నుంచి కూడా సాయిపల్లవి లుక్ విడుదలైంది. ఈ రెండు పోస్టర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

రోజాపువ్విచ్చి ప్రపోజ్ చేస్తే.. ఫ్యాంటు జారిపోయి పరువంతా పోయింది... (Video)

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments