Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య చిత్రంలో సెంచరీ స్టార్... సంక్రాంతి రేస్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి'

యువ‌ర‌త్న నంద‌మూరి న‌ట‌సింహం నటిస్తున్న "గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమా గురించి రోజుకో వార్త వెలువడింది. రూ.70 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో బాల‌య్య కేరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భా

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:33 IST)
యువ‌ర‌త్న నంద‌మూరి న‌ట‌సింహం నటిస్తున్న "గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమా గురించి రోజుకో వార్త వెలువడింది. రూ.70 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో బాల‌య్య కేరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 100వ సినిమాగా తెర‌కెక్కుతున్న శాత‌క‌ర్ణి సినిమా కోసం ద‌ర్శ‌కుడు క్రిష్ ఏ విష‌యంలో కూడా అస్స‌లు రాజీప‌డ‌డం లేదు. 
 
మొరాకో.. జార్జియా లాంటి దేశాలకు వెళ్లి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేయించిన క్రిష్ ఇక్క‌డ కూడా భారీ సెట్టింగ్స్ వేయించి మ‌రీ ఈ సినిమాలో అల‌నాటి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. సినిమా టేకింగ్‌తో పాటు న‌టీన‌టుల విష‌యంలో కూడా క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో శాతకర్ణి తల్లిగా అందాల తార హేమమాలిని నటిస్తుండగా... కబీర్ బేడి వంటి ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా నటిస్తున్నాడు. 
 
ఇంకా శాత‌క‌ర్ణిలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఓ కీలక పాత్రలో చూపించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవ‌లే శివరాజ్ సినిమా 'శివలింగ' 100 రోజుల వేడుకకు కూడా బాలయ్య హాజరయ్యాడు. బాలయ్య సైతం శాత‌క‌ర్ణి సినిమా విశిష్ట‌త‌ను వివ‌రించ‌డంతో శివ‌రాజ్ ఆ కీల‌క రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడ‌ని సమాచారం. దీంతో ఈ సినిమాపై శాండ‌ల్‌వుడ్‌లో కూడా అంచనాలు పెరిగాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ''గౌతమీపుత్ర శాతకర్ణి'' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments