Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై త్రిష ప్రశంసలు.. స్టార్‌డమ్‌కు దూరంగా ఉన్న ఒకే ఒక్క మగాడు

'వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది చెన్నై భామ త్రిష. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా ఏ మాత్రం ఆగకుండా తనదైన స్పీడుతో వరుస సినిమాలు చేస్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:09 IST)
'వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది చెన్నై భామ త్రిష. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా ఏ మాత్రం ఆగకుండా తనదైన స్పీడుతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుందీ తీన్మార్ బ్యూటీ.

ప్ర‌స్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఆమె ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిమానుల‌తో త‌న అభిప్రాయాల‌ను పంచుకుంది. అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు తనదైన శైలిలో స‌మాధానం చెప్పింది. ఓ అభిమాని త్రిష‌ను పవన్‌కల్యాణ్‌ గురించి ఒకమాటలో చెప్పాలంటే? ఏం చెబుతారు అని అడిగాడు. 
 
అందుకు త్రిష 'ఒకే ఒక్కడు' అని ట్వీట్ చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తార‌ని పేర్కొంది. స్టార్‌డమ్‌కు ప‌వ‌న్‌ దూరంగా చాలా సింపుల్‌గా హుందాగా ఉంటారని చెప్పింది. ఇంకా త‌నకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్ట‌మ‌ని, ఇటీవ‌ల వ‌చ్చిన సినిమాల్లో తనకు సుల్తాన్ హిందీ చిత్రం న‌చ్చింద‌ని చెప్పింది.

'మిమ్మల్ని ఏ ప్ర‌శ్న అడిగితే ఇష్టం ఉండ‌దు?' అని త‌న అభిమాని వేసిన ప్ర‌శ్న‌కు త‌న‌ను ఎవ‌ర‌యినా పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌? అని అడిగితే ఆ ప్ర‌శ్న ఇష్టం ఉండ‌ద‌ని సమాధానం చెప్పింది. హీరో మహేష్‌బాబు గురించి అడిగిన ప్రశ్నకు... వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్‌ సూపర్‌స్టార్ అని త్రిష పొగడ్తల వర్షాన్ని కురిపించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments