Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హంటర్‌'కు లేని అభ్యంతరం 'బాబు'కు ఎందుకు? యాంకర్ శ్రీముఖి హ్యాండిచ్చింది...(BBB Trailer)

దర్శకనటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కెళ్లింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులకు దిమ్మతిరిగి పోయిందట. చిత్రంలోని సీన్లు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (10:49 IST)
దర్శకనటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కెళ్లింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులకు దిమ్మతిరిగి పోయిందట. చిత్రంలోని సీన్లు చూడలేకు మహిళా సెన్సార్ సభ్యులు థియేటర్ నుంచి బయటకెళ్లిపోయారట. 
 
ఈ సీన్లు చూసి బిత్తరపోయిన సభ్యులు.. ఈ మూవీలో అసభ్యకర సీన్స్ చాలా ఉన్నాయని, అందువల్ల సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారట. దీంతో చిత్ర దర్శకుడు నవీన్ మేడారం మాత్రం సభ్యులతో వాదనకు దిగారట. 
 
హిందీ చిత్రం 'హంటర్‌'కు రీ-మేక్‌గా తెలుగులో తీసిన రొమాంటిక్ కామెడీ చిత్రమే 'బాబు బాగా బిజీ'. 'హంటర్' చిత్రంలోని సన్నివేశాలకు లేని అభ్యంతరం తెలుగులో మాత్రం ఎందుకన్నది నవీన్ మేడారం సూటి ప్రశ్న. చివరకు ఎలాగోలా ఆ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఓకే చెప్పారట. 
 
కాగా, ఈ చిత్రం మే 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, సుప్రియ, తేజస్వి, మిశ్తీ చక్రవర్తి, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిచారు. మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీముఖి డుమ్మా కొడుతూ దర్శనిర్మాతలకు బాగా హ్యాండిస్తోందట. 
 
ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ శ్రీముఖి పేరుతోనే పబ్లిసిటీ చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. ఈ సినిమాలో శ్రీముఖిది ఇంపార్టెంట్‌ రోల్‌. కానీ, నిడివి తక్కువ. అయినా సరే ఆమె ఫోటోలను పబ్లిసిటీకి వాడుకోవాలని ప్లాన్‌ వేసింది సినిమా యూనిట్‌. అయితే శ్రీముఖి స్టిల్స్‌ ఏవీ వారికి అందుబాటులో లేవట. దానికి కారణం సినిమా షూటింగ్‌ తర్వాత శ్రీముఖి వారికి అందుబాటులో లేకపోవడమే. 
 
ఇతర హీరోయిన్లతోపాటే శ్రీముఖికి కూడా స్పెషల్‌ ఫోటో షూట్‌ ఎరేంజ్‌ చేసిందట చిత్రబృందం. అయితే ఆ కార్యక్రమానికి కూడా శ్రీముఖి డుమ్మా కొట్టిందట. వచ్చే నెల చివరి వరకు శ్రీముఖి ఫుల్‌ బిజీగా ఉండడం వల్ల ఆ ఫోటో షూట్‌కు శ్రీముఖి రాలేదట. దీంతో చేసేది లేక ఇతర హీరోయిన్ల ఫోటోలతోనే పబ్లిసిటీ చేస్తోందట సినిమా యూనిట్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments