Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూ కులకాలని వుంది : సుస్మితా సేన్

సుస్మితా సేన్.. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. మాజీ విశ్వసుందరి. ఎంతోమందికి కలల రాకుమారి. ఈ బెంగాలీ భామకు లేటు వయసులో ఘాటు కోర్కె కలిగింది. కుర్ర వయసులో ఉన్నపుడు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పోటీప

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (10:36 IST)
సుస్మితా సేన్.. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. మాజీ విశ్వసుందరి. ఎంతోమందికి కలల రాకుమారి. ఈ బెంగాలీ భామకు లేటు వయసులో ఘాటు కోర్కె కలిగింది. కుర్ర వయసులో ఉన్నపుడు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పోటీపడి నటించినప్పటికీ.. ఐశ్వర్యారాయ్‌ వంటి నటుల తరహాలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోలేక పోయింది. పైగా, తన మనసులో ఉన్న ఓ కోర్కె కూడా అలానే మిగిలిపోయిందని చెపుతోంది. 
 
ఇంతకీ ఆ కోర్కె ఏంటి..? ఇపుడు ఎలా తీర్చుకోవాలనుకుంటుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ప్రస్తుతం 40 ప్లస్‌ వయసులో ఉన్న సుస్మిత తన ఏజ్‌కు తగ్గ పాత్రలు కాకుండా.. రొమాంటిక్‌ రోల్స్‌ కావాలని అడుగుతోంది. ‘నేను యంగ్‌ ఏజ్‌లో కామెడీ, హారర్‌తోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాను. ఇప్పుడు మాత్రం రొమాన్స్ పాత్రలు చేయాలనుకుంటున్నాన’ని ప్రకటించింది. అయితే, ఈమె నటించే తదుపరి చిత్రంలో మాత్రం మెచ్యూర్డ్ ఉమెన్ పాత్రను పోషించనుంది. 
 
బాలీవుడ్‌లో సినీ ఛాన్సులు తగ్గిన తర్వాత మిగిలిన హీరోయిన్లలా పెళ్లి చేసుకుని సెటిలైపోలేదు. పెళ్లికి దూరంగా ఉంటూనే, ఇద్దరు పిల్లలకు తల్లైంది. అదెలాగంటే.. వారిద్దరిని దత్తత తీసుకుంది. ప్రస్తుతం వారి బాధ్యతలు శ్రద్ధగా చూస్తోంది. అలా, దాదాపు ఏడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సుస్మితకు.. మళ్లీ వెండితెరపై మెరవాలనే ఆశ పుట్టింది. రీ ఎంట్రీలోనేనా ఆమె కోర్కె తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments