Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌పై కాదు.. త్రివిక్రమ్‌పై ఉన్న నమ్మకంతోనే ఓకే చెప్పా : అనూ ఇమ్మాన్యూయేల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినెషన్‌లో తెరెకెక్కే చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసిన భామ అనూ ఇమ్మాన్యూయేల్. 'మజ్ను' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళ కుట్టి... తన రెండ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (09:47 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినెషన్‌లో తెరెకెక్కే చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసిన భామ అనూ ఇమ్మాన్యూయేల్. 'మజ్ను' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళ కుట్టి... తన రెండో చిత్రంలో గోపీచంద్, మూడో చిత్రంలో రాజ్ తరుణ్‌తో నటించింది. ఆ తర్వాత తన నాలుగో చిత్రంలో ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా అవకాశాన్ని సొంతం చేసుకొన్నది. ఈ అవకాశంపై ఆమె స్పందిస్తూ... 
 
'మజ్ను' సినిమాలో నా నటన నచ్చి దర్శకుడు తివిక్రమ్‌ నన్ను సంప్రదించారు. ఆయన ఓ పెద్ద డైరెక్టర్‌ కావడంతో హీరో, కథ, మిగితా విషయాల గురించి అస్సలేమాత్రం పట్టించుకోలేదు. కేవలం త్రివిక్రమ్ మీద ఉన్ననమ్మకంతోనే చిత్రం చేసేందుకు సమ్మతించినట్టు చెప్పారు. 
 
'కిట్టుగాడున్నాడు జాగ్రత్త'లో హీరో రాజ్‌తరుణ్‌తో జతకట్టాను. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పటికీ మరిచిపోలేను. ఎందుకంటే ఆ సినిమాలో కనిపించే కుక్కల్లో చాలా మటుకు రాజ్‌తరుణ్‌ పెంపుడుకుక్కలే! వాటితో భలే కాలక్షేపం అయ్యేది. ఇక పవన్‌ కల్యాణ్‌గారితో షూటింగ్‌ ఇప్పుడే మొదలయింది. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత టెన్షన్‌గా ఫీలయ్యాను. షూటింగ్‌ ప్రారంభమయ్యాక అది తగ్గిందని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments