Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (13:23 IST)
మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ను హీరోగా నటించిన తొలి సినిమా ఉప్పెన. ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పు ఈ సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసారు.
 
పాటలు ప్రేక్షకాదరణ పొందడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే... ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది.
 
ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ.. థియేటర్లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆ ఆఫర్స్‌కి నో చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు కానీ.. వైష్ణవ్ తేజ్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది.
 
అది ఏంటంటే... వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థలో చేయాలనుకుంటున్నారట. అనుకోవడం కాదు ఫిక్స్ అయ్యిందని సమాచారం. ద్వితీయ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో చేయడం వెనక ఓ సెంటిమెంట్ కూడా ఉందని తెలిసింది.
 
 అది ఏంటంటే… రామ్ చరణ్‌ తొలి సినిమా చిరుతను వైజయంతీ మూవీస్ బ్యానర్లో చేసారు. రెండో సినిమా మగథీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో చేసారు.
 
అలాగే సాయిధరమ్ తేజ్ ఫస్ట్ మూవీని వై.వి.ఎస్ బ్యానర్లో చేసారు. ద్వితీయ చిత్రం పిల్లా నువ్వులేని జీవితం చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో చేసారు. అల్లు శిరీష్ కూడా అంతే. అందుకనే ఈ సెంటిమెంట్ ప్రకారం.. వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీని కూడా గీతా ఆర్ట్స్‌లో చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతుంది. మరి... ఈసారి కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments