Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పెన దర్శకుడు బుజ్జిబాబు ''పుష్ప'' పరువు తీసాడా?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (20:08 IST)
పది కె.జి.ఎఫ్‌‌లు కలిస్తే ఒక పుష్ప సినిమా అవుతుంది. ఈ స్టేట్మెంట్ మెగా ఫ్యాన్స్‌కు పదింతల కిక్ ఇచ్చినా అసలు కెజిఎఫ్‌కు పుష్ప సినిమాకు సంబంధమేంటన్న డౌట్ అభిమానుల్లో ఎక్కువగా ఉంది. ఈ మాటలన్నది ఎవరో కాదు సుకుమార్ శిష్యుడు బుజ్జిబాబు. అసలు బుజ్జిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
దర్సకుడు సుకుమార్ శిష్యుడి బుజ్జిబాబు ఉప్పెనతో దర్సకుడిగా పరిచయమయ్యారు. ఆ విజయంతో ఎన్టీఆర్ సినిమా చేయడానికి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇదంతా ఒకే అయితే ఈ మధ్య పుష్ప సినిమాను చూశాడట బుజ్జిబాబు. సినిమా అదుర్స్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడట.
 
పది కె.జి.ఎఫ్‌లు కలిపితే పుష్ప మొదటి భాగం అవుతుందని రీసెంట్‌గా వ్యాఖ్యలు చేశాడు. పుష్పపై బుజ్జిబాబు స్టేట్మెంట్ బన్నీ ఫ్యాన్స్‌ను బాగా హుషారెత్తించిందట. అద్భుతాలు సృష్టిస్తుందన్న నమ్మకానికి కూడా వచ్చేశారట. అయితే పది కెజిఎఫ్‌లు కలిస్తే పుష్ప సినిమా ఎలా అవుతుందని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారట.
 
కెజిఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ లెక్కన పుష్ప సినిమా 2 వేల కోట్లను కలెక్ట్ చేస్తుందా అంటూ కొంతమంది సందేశాలు పంపిస్తున్నారట. పుష్ప బుజ్జిబాబుకు బాగా నచ్చేసింది. బన్నీ నటన, సుకుమార్ మాస్ డైరెక్షన్ చూసి కెజిఎఫ్‌తో పోల్చాడట బుజ్జిబాబు. శిష్యుడి మాటలు గురువు సుకుమార్‌కు కూడా బాగా ఆనందాన్ని తెప్పించిందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments