బాహుబలి దేవసేనతో ఏ మాయ చేసావె దర్శకుడు గౌతమ్ మీనన్ చేతులు కలుపనున్నాడు. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు కొట్టేసిన దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క.. తాజాగా ఓ తమిళ సినిమాకు సంతకాలు చేసేసింది.
బాహుబలి దేవసేనతో ఏ మాయ చేసావె దర్శకుడు గౌతమ్ మీనన్ చేతులు కలుపనున్నాడు. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు కొట్టేసిన దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క.. తాజాగా ఓ తమిళ సినిమాకు సంతకాలు చేసేసింది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా మంచి పేరుకొట్టేసిన అనుష్క.. కోలీవుడ్ కూల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది.
పూర్తిగా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరిగే ఈ స్టోరీ చెప్పడంతో దేవసేనకు కథ నచ్చేసింది. దీంతో త్వరలో అనుష్క-గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన యువి వారితో భాగమతి సినిమాను చేస్తోంది. జి. అశోక్ తెరకెక్కిస్తోన్న ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక గౌతమ్ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొంటుందని సినీ జనం అంటున్నారు.