Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి ప్రియాంకా ఇంటికి సమీపంలో ఉగ్రదాడి...

అమెరికాలోని న్యూయార్క్ నగరం, మ్యాన్‌హాట్టన్ ఏరియాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నివసించే ఇంటికి సమీపంలో చోటుచేసుకుంది. ఇసిస్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఒకరు అల్లాహూ అక్బర్ అంట

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (13:23 IST)
అమెరికాలోని న్యూయార్క్ నగరం, మ్యాన్‌హాట్టన్ ఏరియాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నివసించే ఇంటికి సమీపంలో చోటుచేసుకుంది. ఇసిస్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఒకరు అల్లాహూ అక్బర్ అంటూ ట్రక్కుతో దాడికి తెగబడిన విషయం తెల్సిందే. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా, మరో 11 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడి ప్రియాంకా చోప్రా ఇంటికి అతి సమీపంలో జరిగింది. 
 
ఈ దాడిపై బాలీవుడ్ నటి ట్వీట్ చేసింది. తాను నివసిస్తున్న ఇంటికి సమీపంలోనే ఈ దాడి జరిగింది. తన పనిని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరిన వేళ ఆ ప్రాంతమంతా సైరన్ల మోతతో హోరెత్తుతుంటే హడలిపోయానని, ఈ భయానక ఉగ్రదాడి జరగడంతో తాను షాక్‌కు గురైనట్టు ఆమె ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడిన తర్వాత "అల్లాహు అక్బర్‌" అని అరుస్తూ వెళ్తున్నారని స్థానికుల ద్వారా తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments