Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెళ్లి ఫోటో.. వర్మ లేటెస్ట్ పోస్టు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోని ఓ వివాదాస్పద అధ్యాయాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (13:15 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోని ఓ వివాదాస్పద అధ్యాయాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్  చిత్రాన్ని తెరకెక్కిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి ఎన్నో విమర్శలు, ఆరోపణలు వర్మపై వెల్లువెత్తుతున్నాయి. 
 
ఎన్టీఆర్ కీర్తికి భంగం కలగకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని తెలుగుదేశం పార్టీ మంత్రులు, నాయకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. వర్మ తాజాగా వారికి కౌంటరిచ్చారు. ఈ మేరకు వర్మ తాజాగా, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
అద్భుత అవగాహనతో, సృజనాత్మకతతో, అసాధారణ రీతిలో హరిణి రూపొందించిన అల్ట్రా అల్టీమేట్ ఇమేజ్ తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని వర్మ కామెంట్ చేశారు. ఇందుకు తోడుగా నాడు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి వివాహ వేడుకలో ఎన్టీఆర్ దంపతులు ఉన్న ఫొటోను ఉంచి.. దాని కింద లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పెట్టారు. మరి ఈ ఫోటోకు ఎలాంటి కామెంట్స్ వస్తాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments