Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్-బాలయ్య చుట్టూ తిరుగుతున్న బోనీ కపూర్, ఎందుకు?

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:51 IST)
బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్... నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా ప్రొడ్యూస‌ర్ అనుకుంటున్నారా..? బోనీ క‌పూర్. అవును... ఇది నిజంగా నిజం. మేట‌ర్ ఏంటంటే... హిందీలో నిర్మించిన పింక్ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా త‌మిళ్‌లో అజిత్ తో రీమేక్ చేస్తే... అక్క‌డ కూడా స‌క్స‌స్ అయ్యింది. దీంతో ఇప్పుడు దీనిని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.
 
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 5 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. 
 
ఇదిలాఉంటే... పింక్ తెలుగు రీమేక్ రైట్స్ బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ ద‌గ్గ‌ర ఉన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు బాల‌య్య‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే... బాల‌య్య ఇంకా త‌న నిర్ణ‌యం చెప్ప‌లేద‌ట‌. 
 
రీసెంట్‌గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఈ రీమేక్‌లో న‌టించ‌మ‌ని సంప్ర‌దించార‌ట‌. అయితే... ప‌వ‌న్ పాజిటివ్‌గానే స్పందించార‌ట కానీ... ఇంకా ఏ విష‌యం చెప్ప‌లేద‌ట‌. దీంతో పింక్ తెలుగు రీమేక్‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments