ఒక దర్శకుడైతే నా ఎద అందం ఎలా ఉందో చూడాల‌న్నాడు.. సుర్వీన్ చావ్లా

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:36 IST)
క్యాస్టింగ్ కౌచ్, మీటూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలు రంగాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినీ రంగంలో పలువురు సెలెబ్రిటీలు తమకు ఎదురైన అనుభవం గురించి ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
ఈ క్రమంలో సీనియ‌ర్ న‌టుడు నానాప‌టేకర్‌పై త‌ను శ్రీ దత్తా, ప్రముఖ రచయిత వైర‌ముత్తుపై సింగ‌ర్ చిన్మయి, యాక్షన్ కింగ్ అర్జున్‌పై హీరోయిన్ శృతి హరిహ‌ర‌న్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేశారు. తెలుగునాట శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కూడా ప్రకంపనలు సృష్టించాయి.
 
తాజాగా టాలీవుడ్‌లో రాజు మహారాజు సినిమాలో శర్వానంద్ సరసన నటించిన సుర్వీన్ చావ్లా కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పింది. తమిళంలో మాత్రమే వచ్చిన ఓ డైరక్టర్... ఏవేవో డైలాగులు చెప్పించి.. ఏవేవో చేయించాడని చెప్పింది. అతని నుంచి తప్పించుకుని ఆరోగ్యం బాగోలేదని ముంబై వచ్చేశానని చెప్పింది. ఆపై పరిపరివిధాలా ఆ డైరక్టర్ తనను కలవాలనుకున్నాడని.. కానీ తాను అంగీకరించలేదని చెప్పింది. 
 
మరో దర్శకుడైతే ఏకంగా ''నీ శ‌రీరంలో ప్రతి భాగం గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నాను" అని అన్నాడని, రెండేళ్ల ముందు కూడా బాలీవుడ్‌లో ఓ దర్శకుడు "నీ ఎద అందం ఎలా ఉంటుందో చూడాల‌నుకుంటున్నాను" అని అన్నాడని తనకు ఎదురైన వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.. సుర్వీన్ చావ్లా.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సాయిపల్లవి వైబ్రేషన్స్ : మూడు పాటలకు పది కోట్ల వ్యూస్