తొడలు ఎలా ఉంటాయో చూపించమన్నాడు : సుర్విన్ చావ్లా

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:05 IST)
సినీ ఇండస్ట్రీనికి క్యాస్టింగ్ కౌచ్ అంశం పట్టిపీడిస్తోంది. దీనిబారిన ఎంతో మంది హీరోయిన్లుపడినట్టు వార్తలు వచ్చాయి. అలా క్యాస్టింగ్ కౌచ్ బారినపడిన బాధితులు మీ టూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అపుడు తమకు ఎదురైన అనుభవాలను వారు బహిరంగపరిచారు. ఈ కోవలో తాజాగా బాలీవుడ్ నటి సుర్విన్ చావ్లా చేరింది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఆమెకు ఎదురైన సంఘటనలను పూసగుచ్చినట్టు వివరిస్తోంది. 
 
తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సుర్విన్ చావ్లా ఓ ఇంట‌ర్వ్యూలో తాను ఐదుసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాన‌ని చెప్పి పెద్ద బాంబే వేశారు. ద‌క్షిణాదిన మూడుసార్లు, ఉత్త‌రాదిన రెండు సార్లు తాను కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నాన‌ని ఆమె వెల్లడించింది.
 
బుల్లితర నుంచి వెండితెరకు వచ్చిన నాకు సినిమా రంగంలో ప్ర‌యాణం అంత స‌జావుగా సాగ‌లేదని చెప్పింది. ద‌క్షిణాదిన జాతీయ అవార్డు తెచ్చుకున్న ఓ ద‌ర్శ‌కుడి (ఇత‌నికి త‌మిళం మాత్ర‌మే వ‌చ్చు) ద‌గ్గ‌ర‌కు ఆడిష‌న్‌కు వెళితే.. ఏవేవో డైలాగులు చెప్పించి ఏదేదో చేయించాడు. నాకు ఆరోగ్యం స‌రిగా లేదంటూ ముంబై వ‌చ్చేశాను. వేరే వారితో నాకు ఫోన్ చేయించి 'నీకు ఆరోగ్యం స‌రిగా లేదు క‌దా.. నేను ముంబై రావాలా?' అని అడిగించాడు. దీనికి నేను నో థ్యాంక్స్ అని సమాధానం చెప్పినట్టు తెలిపారు. 
 
అలాగే, మరో ద‌ర్శ‌కుడు 'నీ శ‌రీరంలో ప్ర‌తి భాగం గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నాను' అన్నాడు. రెండేళ్ల ముందు కూడా బాలీవుడ్‌లో ఓ దర్శ‌కుడు 'నీ ఎద ఎలా ఉంటుందో చూడాల‌నుకుంటున్నాను' అన్నాడు. అలాగే, మరో దర్శకుడు నీ తొడ‌లు ఎలా ఉంటాయో చూడాల‌నుకుంటున్నాను' అని అన్నాడు. వారు నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించిన ప్ర‌తిసారి వారి ఆఫీసుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశానంటూ త‌న‌కు ఎదురైన కాస్టింగ్ కౌచ్ ప‌రిస్థితుల గురించి సుర్విన్ చావ్లా తెలియ‌జేశారు. ప్రస్తుతం ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశాలు ఇపుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వంద ఎపిసోడ్లుగా నిహారిక మ్యాడ్ హౌస్ (వీడియో)