పవన్ హీరోయిన్‌పై కన్నేసిన బాలయ్య... లేడీ విలన్ పాత్రలో భూమిక!?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (12:00 IST)
పవర్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "ఖుషి". సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పవన్ సినీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం. ఇందులో భూమిక హీరోయిన్. ఓ సన్నివేశంలో ఆమె నల్లచీర కట్టుకుని ప్రదర్శించిన నాభి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ అమ్మడు పెళ్లి చేసుకుని, సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 
 
ఇటీవలి కాలంలో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్క‌, వ‌దిన పాత్ర‌ల్లో మెప్పిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు భూమిక‌కు మ‌రో మంచి అవ‌కాశం ద‌క్కింద‌ట‌. అదేంటంటే ఓ స్టార్ హీరో సినిమాలో లేడీ విల‌న్‌గా. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవ‌ర‌ని అనుకుంటున్నారా? న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌. 
 
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106వ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. ఇటీవ‌ల తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత రెండో షెడ్యూల్ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. 
 
ఈ చిత్రంలో లేడీ విల‌న్ పాత్ర‌లో భూమిక న‌టింపచేస్తున్నార‌ట‌. బాల‌కృష్ణ గ‌త చిత్రం 'రూల‌ర్'లో న‌టించిన భూమిక మ‌రోసారి బాల‌య్య సినిమాలో న‌టించ‌నున్నారు. మ‌రి లేడీ విల‌న్‌ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments