Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోక్ష‌జ్ఞను ఫ్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టేందుకు బాలయ్య డిసైడ్?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:06 IST)
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గురించి అధికారికంగా ఎలాంటి వార్త బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా మోక్షజ్ఞ ఫ‌స్ట్ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ విదేశాల్లో యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ ఫ‌స్ట్ మూవీ ప్రారంభం కానుంద‌ని. 
 
అయితే.. ఈ సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించే అవ‌కాశాన్ని బోయపాటి శ్రీను లేదా క్రిష్‌కి అప్ప‌చెప్పాల‌నే ఆలోచ‌న‌లో బాల‌య్య ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రితో పాటు ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడి పేరు వచ్చి చేరింది. అత‌నే డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్. మోక్షజ్ఞ ఎంట్రీ పూరి డైరెక్ష‌న్లో‌నే ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో పాటు సాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌, యంగ్ హీరో ఇషాన్‌లను వెండితెరకు పరిచయం చేశాడు పూరి.
 
మాస్, యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చిత్రాలు తెరకెక్కించటంలో పూరి స్పెషలిస్ట్‌. ఇటీవ‌ల పూరి తీసిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. అయినా పూరి చేతిలో మోక్ష‌జ్ఞ‌ను బాల‌య్య పెడ‌తాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments