Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను లెక్కల్లో పూర్... ఇంట్లోని వ్యవహారాలన్నీ ఆమె చక్కబెడుతుంది : బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండవ శతాబ్ధానికి చెందిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (10:02 IST)
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండవ శతాబ్ధానికి చెందిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోండగా కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య శాతకర్ణిగా నటిస్తోండగా ఆయన తల్లి గౌతమిగా హేమమాలిని నటిస్తోంది. ఇక శాతకర్ణి భార్య వాశిష్టదేవిగా శ్రేయశరన్ నటిస్తోంది. 
 
ఈ చిత్రంలో హేమమాలిని చాలా హుందాతనంతో కనిపిస్తోంది. రాజు గెటప్‌లో ఉన్న బాలయ్య అదరగొట్టేశాడు. ఏదేమైన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు చూసిన అభిమానులు బాలయ్య సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని వారు చెబుతున్నారు. ఇక క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇదిలావుంటే ఒక ఇంటర్వ్యూలో తన భార్య గురించి మొదటిసారి బాలయ్య నోరు విప్పారు. 
 
బాలకృష్ణ భార్య పేరు వసుంధరా దేవి. బాలయ్య తన భార్య గురించి మాట్లాడుతూ....''పేరుకి తగ్గట్టు వసుంధరకి ఓర్పు ఎక్కువ. మా అమ్మలోని లక్షణాలన్నీ తనలో నిండుగా వున్నాయి. సినిమాలో నటిస్తున్నందున ఎక్కువగా నేను ఇంట్లో ఉండేవాడిని కాదు. నేను ఇంట్లో లేని సమయాల్లో ఇంటిని చక్క బెట్టే బాధ్యతని నా భార్య వసుంధర చూసుకుంటుంది. 
 
అంతేకాకుండా కొన్ని సార్లు షూటింగులకు నేను విదేశాలకి వెళ్ళినప్పుడు పిల్లల బాగోగులు చూసుకుంటుంది. నాకేమైనా సమస్య వస్తే వసుంధరే నాకు మంచి పరిష్కారం చెబుతుంది. ఆమె భార్యగా రావడం నా పూర్వ జన్మ సుకృతం. ఆమె నాకు భార్యగానే కాకుండా మిత్రురాలిగాను ఉంటుంది. లెక్కల్లో నేను చాలా పూర్ కావడంతో ఇంట్లోని వ్యవహారాలన్నీ తానే చూసుకుంటుంది'' అని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments