Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్యను చీట్ చేసిన సమంత.. పెళ్లి బాజాలు మోగేనా?

అక్కినేని నటవారసుడు పెళ్లి బాజాలు త్వరలో మోగనున్నాయి. ఈ విషయంపై చాలారోజులుగా ఉన్న దాగుడుమూతలకు తెరదించుతూ నాగార్జున తనయున పెళ్లి డేట్స్ ప్రకటించారు. నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేయడానికి నేను

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (09:39 IST)
అక్కినేని నటవారసుడు పెళ్లి బాజాలు త్వరలో మోగనున్నాయి. ఈ విషయంపై చాలారోజులుగా ఉన్న దాగుడుమూతలకు తెరదించుతూ నాగార్జున తనయున పెళ్లి డేట్స్ ప్రకటించారు. నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేయడానికి నేను సిద్దం అని అన్నారు నాగార్జున. నాగ చైతన్య, సమంత ''ఏ మాయ చేశావే'' సినిమాలో తొలుత కలిసి నటించారు. ఆ తర్వాత ''ఆటోనగర్ సూర్య'', ''మనం'' చిత్రాల్లోనూ నటించారు. కొద్దికాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.
 
మొత్తం మీద నాగ చైతన్య కూడా తండ్రి దారిలోనే నటిని వివాహం చేసుకోబోతున్నారన్న మాట. ఈ నేపథ్యంలో ప్రేమలో ప్రతిక్షణాన్ని సమంత ఎంజాయ్ చేస్తోంది. నాగ చైతన్యతో వివాహం గురించి ప్రకటించిన తరువాత తొలిసారి సమంత సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఆ ఫోటోలో నాగచైతన్య ఫోటోపై లూజర్ అని, తన ఫోటోపై విన్నర్ అని కామెంట్ రాసుకుంది. అయితే ఈ ఫోటోలో లూజర్ ఠీవీగా నిల్చుని ఉండగా, విన్నర్ కిందపడిపోయి విజయానందం ఆస్వాదిస్తూ ఉంది.
 
నాగచైతన్యతో కలిసి షటిల్‌ ఆడి నీరసించిపోయిన సమంత మ్యాచ్‌లో తానే గెలిచానని తెలిపింది. అంతేకాదు ''బూ హ హ హ హ.. ఇలాంటి సమయంలో పీవీ సింధు మాకు స్ఫూర్తి'' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌‌కు బ్యాడ్మింటన్‌ డబుల్స్ మహిళా క్రీడాకారిణి గుత్తా జ్వాలా వెంటనే రీ ట్వీట్ చేసింది. ''హ హ హ.. గెలిచినందుకు శుభాకాంక్షలు'' అని ట్వీట్‌ చేసింది. దానికి సమంత జవాబిస్తూ, ''నేను చీట్‌ చేశాను'' అంటూ ఆటలో చైతన్య గెలిచినట్లు పోస్ట్ చేసింది. ఎంతైనా సమంత మంచి ప్రియురాలని... తను చైని సరదాగా ఆటపట్టించిందని, ఇతరుల దగ్గర అతను గొప్ప అని చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments