Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య - బోయపాటి కలిస్తే 'డేంజర్'? నిజమేనా??

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:03 IST)
యువరత్న నందమూరి బాలకృష్ణ - సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. బీబీ3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అంటే.. వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా రానున్న మూడో చిత్రం ఈ బీబీ3. 
 
ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ కాస్త చక్కబడగానే.. మళ్లీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఏమిటనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని 'బీబీ3' అని పిలుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
 
ఇక టైటిల్ విషయానికి వస్తే, ఈ చిత్రానికి 'డేంజర్' అనే పేరు పెట్టనున్నట్టు సమాచారం. ఇదేపేరుతో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఇపుడు ఇదే టైటిల్ మరోమారు తెరపైకి వచ్చింది. 
 
ఇంకోవైపు, 'టార్చ్‌బేరర్' అనే టైటిల్ కూడా తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టార్చ్ బేరర్ అనే ఎక్కడో విన్నట్టు ఉంది అనేకదా మీ సందేహం. నిజమే... ఎక్కడో కాదు అబ్బాయి తారక్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇది. 
 
ఈ చిత్రం హీరో ఎన్టీఆర్ గురించి వివరిస్తూ.. ఆ సినిమాలో విలన్ రావు రమేష్ చెబుతాడు. అప్పటి ఈ మాటే ఇప్పుడు బాలయ్య చిత్ర టైటిల్ కాబోతోందా? ఏమో.. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో.. చూద్దాం. నెటిజన్లు మాత్రం ఈ రెండు టైటిళ్ళపై తెగ చర్చ సాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments