Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్లికాని ప్రసాద్'గా బాలకృష్ణ .. డైరెక్టర్ తేజతో మంతనాలు?

విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే హీరో నందమూరి బాలకృష్ణ ఈ దఫా పెళ్లికాని ప్రసాద్ తరహాలో ఓ పాత్ర చేయనున్నారు. ఇటీవల బాలయ్య నటించిన 101వ చిత్రం "పైసా వసూల్" బాక్సాఫీస్ వద్ద బోల్త

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (13:49 IST)
విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే హీరో నందమూరి బాలకృష్ణ ఈ దఫా పెళ్లికాని ప్రసాద్ తరహాలో ఓ పాత్ర చేయనున్నారు. ఇటీవల బాలయ్య నటించిన 101వ చిత్రం "పైసా వసూల్" బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శత్వం వహించారు. 
 
అయితే, తన 102వ చిత్రాన్ని మాత్రం బాలయ్య ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇందులోభాగంగా, 102వ సినిమాకి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ ఎలా కనిపించబోతున్నాడు? ఆయన పాత్ర ఎలా వుండబోతోంది? అనే విషయాలపై అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.
 
ఈ సినిమాలో ఆయన 'పెళ్లికాని ప్రసాద్' తరహా పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 40 ఏళ్లు వచ్చేవరకూ పెళ్లి కాకుండా ఉండిపోతాడట. ఆ తర్వాత నయనతారను ప్రేమించి భగ్న ప్రేమికుడిగా మారిపోతాడనేది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అందుకు గల కారణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. చిత్రం రెండో భాగంలో మళ్లీ నయనతార ఆయన జీవితంలోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. కాగా, ఈ చిత్రంలో మరో కథానాయికగా నటాషా దోషి నటిస్తుండగా, ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల మందుకురానుంది.  
 
మరోవైపు.. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు తేజకు హీరో బాలకృష్ణ నుంచి పిలుపు వెళ్లిందట. ఎంతో మంది పెద్ద నిర్మాతలు తేజతో చిత్రం చేసేందుకు క్యూలో ఉండగా, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను తలపెట్టిన చిత్రానికి తేజతో దర్శకత్వం చేయించాలని బాలయ్య భావిస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 
 
ఈ విషయంలో బాలకృష్ణ, తేజల మధ్య చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దాదాపుగా ఎన్టీఆర్ బయోపిక్‌కు తేజ దర్శకుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments