Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' బంపర్ ఆఫర్‌ను తిరస్కరించిన సోనమ్ కపూర్...ఎందుకో తెలుసా?

రాజమౌళి అద్భుత సృష్టి ''బాహుబలి ది బిగినింగ్'' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంతో తెలుగు పరిశ్రమ ప్రపంచవ్యాప్తమైంది. అందులో నటించిన నటీనటుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వారి స్థ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (16:20 IST)
రాజమౌళి అద్భుత సృష్టి ''బాహుబలి ది బిగినింగ్'' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంతో తెలుగు పరిశ్రమ ప్రపంచవ్యాప్తమైంది. అందులో నటించిన నటీనటుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వారి స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతటి గొప్ప విజయం సాధించిన ఈ చిత్రంలో నటించే అవకాశం వెతుకుంటూ వస్తే ఎవరైనా వదులుకుంటారా. కానీ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అదే పని చేసిందట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. 
 
బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన చాట్‌ షో కార్యక్రమంలో మాట్లాడుతూ సోనమ్ ఈ విషయాన్ని బయటపెట్టింది. ''బాహుబలి చిత్రం గొప్ప చిత్రమని ఆ చిత్రాన్ని తాను చూడలేదని కానీ స్క్రిప్ట్ విన్నానని చెప్పింది. ఆ సినిమాలో నటించే ఆఫర్ వచ్చిందని, స్క్రిప్ట్ మొత్తం విన్నానని కానీ చేయలేదని చెప్పింది. అంతేగాని అంత గొప్ప ఆఫర్ ఎందుకు వదులుకుంది? అసలు రాజమౌళి తనను ఏ పాత్ర కోసం సంప్రదించారు? 
 
ఫస్ట్‌పార్ట్‌లో వచ్చే తమన్నా పాత్ర కోసమా? లేకపోతే రెండు భాగాల్లో ఉండే అనుష్క పాత్ర కోసమా? అన్నది మాత్రం బయటపెట్టలేదు. మొత్తానికి సోనమ్ లేటుగా చెప్పినా కాస్త షాకింగ్ విషయమే చెప్పింది. అయితే ఈ చిత్రంలోని రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు శ్రీదేవి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ జాబితాలో మరో భామ కూడా చేరిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments