Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకొక కేక్‌ కావాలి.. పెద్దదిగా ఉండాలి... ప్రొడక్షన్‌‌తో పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం' సినిమాలో బావ పాత్రలో నటించిన నటుడు శివబాలాజీ.. ఇపుడు 'కాటమరాయుడు' సినిమాలో పవన్‌కు తమ్ముడు పాత్రలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు కి

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (15:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం' సినిమాలో బావ పాత్రలో నటించిన నటుడు శివబాలాజీ.. ఇపుడు 'కాటమరాయుడు' సినిమాలో పవన్‌కు తమ్ముడు పాత్రలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని(డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌కు ముగ్గురు తమ్ముళ్ళు ఉండనున్నారు. అందులో ఒకరు నటుడు శివబాలాజీ. పవన్ కళ్యాణ్ తమ్ముడు 'శివరాయుడు'గా నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, చాలా సంతోషంగా ఉందని శివబాలాజీ అన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టొరీగా ఈ సినిమా రూపొందనుంది.
 
ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే...శుక్రవారం శివబాలాజీ పుట్టినరోజు. ఆరోజు సెట్‌లో ఏం జరిగిందో శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వివరించారు. ''పవన్‌కల్యాణ్‌ గారు రోజూలాగే లొకేషన్‌కి వచ్చారు. వెంటనే లేచి గుడ్‌ మార్నింగ్‌ సర్‌ అన్నాను. ఆయన నన్ను పలకరిస్తున్నంతలోనే దర్శకులు డాలీ, పవన్‌కల్యాణ్‌ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సార్‌ అని చెప్పారు. వెంటనే పవన్‌గారు నా భుజంమీద చెయ్యివేసి నీ కోసం ఏమన్నా చెయ్యాలోయ్‌ అని, ప్రొడక్షన్‌ అంటూ గట్టిగా పిలిచారు. వెంటనే ప్రొడక్షన్‌ చీఫ్‌ ఆయన ముందుకి వచ్చారు. 
 
నా కొక కేక్‌ కావాలి.. పెద్దదిగా ఉండాలి.. ఏం శివా బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌ నచ్చుతుందా? అన్నారు.. నేను అలాగే కళ్ళప్పగించి ఎస్‌ సర్‌ అన్నాను. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్‌. అప్పుడు పవన్ గారితో నా భార్య మధుని పిలవచ్చా అని అడిగాను. పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా రమ్మనవోయ్‌ అన్నారు. పవన్‌ గారి మానవత్వానికి, ఆయన చేసే కొన్ని వేల సేవలలో.. నా పుట్టినరోజునాడు చేసింది చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం, విలువకట్టలేని, మాటలలో చెప్పలేను. ఈ పుట్టిన రోజుని నా జీవితంలో మధురానుభూతిగా నిలిపిన దర్శకుడు డాలీ(కిషోర్‌కుమార్‌ పార్ధసాని)కి ధన్యవాదాలు’ అని శివబాలాజీ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments