Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ రేంజ్‌లో 'బాహుబలి-2'ను తెరకెక్కిస్తున్న రాజమౌళి

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (11:15 IST)
ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బాహుబలి సీక్వెల్‌గా 'బాహుబలి 2' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
తెలుగు సినిమా స్థాయినే కాదు ఇండియన్ సినిమా స్టామినాను చాటి చెప్పిన 'బాహుబలి' సినిమా మొదటి పార్ట్‌కే అభిమానులు దాసోహమైపోయారు. 'బాహుబలి 2' చిత్రాన్నిఎలాగైనా 2017 ఏప్రిల్ 14లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ హాలీవుడ్ సినిమా టెన్షన్ పెడుతోంది. ఆ సినిమానే అవతార్. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే హాలీవుడ్ సినిమా అవతార్ కూడా పార్ట్ 2 రెడీ అవుతోంది. 
 
జేమ్స్ కామెరూన్ ఆ సినిమా రెండో పార్ట్‌ను కూడా అంతే అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు. అవతార్ మొదటి పార్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు 'బాహుబలి 2', 'అవతార్ -2' ఓకేసారి రిలీజ్ అయ్యే పరిస్థితులు కనబడడంతో అటు సినీ అభిమానులకు, ఇటు సినీ నిపుణులకు టెన్షన్ మొదలవుతోంది. 
 
దీంతో అవతార్ బాహుబలి కి గట్టి పోటీనిచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. మొత్తానికి 'అవతార్-2', 'బాహుబలి-2' కి కలెక్షన్లకు గండి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments