Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు గెటప్‌లో కార్తీ : నయన, శ్రీదివ్య కాంబోలో ''కాష్మోరా''

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (10:50 IST)
నటుడు సూర్య మూడు భిన్నమైన గెటప్స్‌తో '24'లో నటించాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తీకూడా ప్రయత్నిస్తున్నాడు. 'రౌద్రం' ఫేం గోకుల్‌ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా 'కాష్మోరా' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. చెన్నై - పూనమల్లె రహదారి సమీపంలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ షూటింగులో కార్తీ, నయనతార, శ్రీదివ్య పాల్గొంటున్నారు. సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అధునాతన సాంకేతికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వుండటం విశేషం. దాదాపు పదిహేను నిమిషాల పాటు 3 ఫేస్‌ స్కాన్‌ చేసి చిత్రీకరించనున్నారు. గతంలో రజనీకాంత్‌ 'కొచ్చాడియాన్‌' సినిమాకు ఈ టెక్నాలజీ ఉపయోగించిన విషయం తెలిసిందే. 
 
అయితే అప్పుడు మొత్తం శరీరాన్ని అంతటినీ స్కాన్‌ చేసి ఉపయోగించి తీసిన టెక్నాలజీ ని ప్రస్తుతం కార్తీ ఫేస్‌ వరకు మాత్రం స్కాన్‌ చేసి ఉపయోగిస్తున్నారు. గ్రాఫిక్స్‌ని 'బాహబలి' సినిమాకి పనిచేసిన మకుట సంస్థ సమకూరుస్తున్నది. ఈ సినిమాకి ఓం ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. 
 
కాగా, ఈ సినిమా ఫస్టులుక్‌ కోసం కార్తీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ నెల 25న కార్తీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టులుక్‌ ను రిలీజ్‌ చేయనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments