Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పైసా వసూల్'కు నెగెటివ్ టాక్.. 'అర్జున్ రెడ్డి' మరింత దూకుడు

గత నెల 25వ తేదీన విడుదలైన 'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలై వారం కూడా కాకముందే ఈ సినిమా కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (12:02 IST)
గత నెల 25వ తేదీన విడుదలైన 'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలై వారం కూడా కాకముందే ఈ సినిమా కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అమెరికాలో కేవలం 89 థియేటర్స్‌లో మాత్రమే విడుదలైన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను వసూలు చేసింది.
 
ఇంత తక్కువ థియేటర్స్‌లో విడుదలై .. ఇంత తక్కువ సమయంలో ఒక మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఇంతకుముందు అక్కడ రిలీజైన ఏ తెలుగు సినిమా ఈ అరుదైన ఫీట్‌ను సాధించలేకపోవడం విశేషం. 'పెళ్లి చూపులు' మాదిరిగానే 'అర్జున్ రెడ్డి' కూడా అక్కడ ఎక్కువ రోజులు ఆడేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
 
కాగా, ఈ చిత్రంలోని ముద్దు సన్నివేశాల వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ఏ సినిమా అయినా బాగుంటే కాంట్రావర్సీస్ ఎంత చేసినా ఎవరూ పట్టించుకోరని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపం ‘కిస్’ అని, కాంట్రావర్సీ సినిమా తాము తీయలేదని, ఈ సినిమాపై కొందరు కాంట్రావర్సీ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో హిపోక్రసీ లేదని, ఇలాంటి ప్రేమకథలు చాలా ఉంటాయని, అందుకే, ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చిందని, బాగా ఆదరిస్తున్నారని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments