Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్‌ సోల్‌ మేట్సా, లెస్‌బియన్సా?

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (10:51 IST)
Ruhani Sharma, Akanksha Singh
ఇద్దరు అందమైన జంట అనుకోకుండా కలిసి వారి అనుభవాలను షేర్‌ చేసుకుని ఒకటయితే మీట్‌ క్యూట్‌ అంటారు. అలాంటి ఇద్దరు అందమైన జంట కథతో 1935లో ఆంగ్లంలో మీట్‌ క్యూట్‌ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు లెస్‌బియన్‌ కథలతోనూ విదేశీ కల్చర్‌తో పలు సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే వున్నాయి. సాంకేతిక విప్లవం వల్ల అది మన ఇండియాకూ పాకింది. ఇద్దరు అమ్మాయిల ప్రేమకథతో డేంజరస్‌ అంటూ రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీసి విడుదల చేస్తున్నాడు. అందులో అప్సరారాణి లెస్‌బియన్‌గా జీవించిందనే చెప్పాలి. తను సోషల్‌ మీడియాలో చాలా ఓపెన్‌గా వుంటుంది.
 
ఇదిలా వుండగా, తాజాగా మీట్‌ క్యూట్‌ అనే వెబ్‌ సిరీస్‌ సోనీలైవ్‌లో రాబోతుంది. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలుగా మారారు కూడా. ఇందులో ఐదు ఎపిసోడ్స్‌, ఐదుగురు జంటల కథ. అందులో రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్‌లు ఇద్దరూ నటించారు కూడా. ఈ సందర్భంగా రుహాని చాలా క్యూట్‌గా ఓపెన్‌గా తన మనసులోని మాటలను ఇలా వ్యక్తం చేసింది. ఆకాంక్షతో నా మొదటి మీట్‌ క్యూట్‌ అంటూ రుహాని శర్మ చెప్పుకొచ్చింది. మొదట ఆమె గురించి తెలీదు. ఈవెంట్‌కు వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం. ఇద్దరం 15 నిముషాల్లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయాం. ఛాటింగ్‌కానీ, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళం. నా సోల్‌మేట్‌గా మారిపోయింది. ఇద్దరం ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం, హగ్‌ చేసుకోవడం జరుగుతుండేది. తను ఇప్పుడు కూడా నేను మాట్లాడేది ఫోన్‌లో షూట్‌ చేస్తుంది. నేను తను మాట్లాడేటప్పుడు షూట్‌ చేస్తాను. ఇక్కడేకాదు సెట్లో కూడా ఒకరంటే ఒకరు పడిచచ్చేంతగా వుండేవాళ్ళం. ఇదే నా మొదటి మీట్‌క్యూట్‌ అంటూ వివరించింది. చాలా ఓపెన్‌గా చెప్పడం ఆమెకే చెల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments