Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాని సమర్పణలో మీట్ క్యూట్ ట్రైలర్ విడుదల

Meet Cute still
, శుక్రవారం, 18 నవంబరు 2022 (16:32 IST)
Meet Cute still
టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేసిన ''మీట్ క్యూట్' టీమ్ ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేసింది. టీజర్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి రోలర్ కోస్టర్ ఎమోషన్ ని చూపించగా, ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది.
 
‘నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’’ అంటూ నాని వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ మనసును హత్తుకునేలా ఉంది.
 
కొన్ని అర్బన్ ప్రేమ కథలను.. విభిన్న ప్రేమికుల మధ్య విభిన్న భావోద్వేగాలను ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. మనం ప్రేమించే వారితో, మనం ఇష్టపడే వాటి కోసం మాత్రమే గొడవపడతాం' అనే సందేశాన్ని ఈ ఎంథాలజీ హృద్యంగా అందిస్తోంది.
 
ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉంది. ఈ తరం యువతకు రిలవెంట్ గా వుంది. సిరీస్ లోని పెద్దలు రెండు తరాల మధ్య వారధిగా కనిపిస్తున్నారు.
 
అన్ని రకాల భావోద్వేగాల సమ్మేళనంగా మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ సీరీస్ ప్రజంట్ చేయడంలో దర్శకురాలు దీప్తి గంటా ఆకట్టుకున్నారు. ట్రైలర్ లో చూపించిన భావోద్వేగాలు మనసుని హత్తుకునేలా వున్నాయి.
 
ట్రైలర్ అద్భుతమైన విజువల్స్ తో పాటు సిరీస్ కు తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. దీనికి వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. టెక్నికల్ టీం అంతా అద్భుతమైన టీం వర్క్ తో గ్రేట్ అవుట్ పుట్ ఇచ్చింది.
 
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ‘మీట్ క్యూట్'  నిర్మిస్తున్నారు. సత్యరాజ్ , రోహిణి మొల్లేటి , అదా శర్మ , వర్షా బొల్లమ్మ,  ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ ,సునయన, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య,  రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
టీజర్ మంచి అంచనాలను నెలకొల్పగా, ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. నవంబర్ 25 నుండి సోనీ లివ్‌లో ఎంథాలజీ  స్ట్రీమింగ్ కానుంది.
 
తారాగణం - సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా
 
రచన, దర్శకత్వం: దీప్తి గంటా
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సమర్పణ: నాని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
డీవోపీ: వసంత్ కుమార్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: గ్యారీ బిహెచ్
లిరిక్స్ : కెకె
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైగర్ చిత్ర నిధులపై పూరీ జగన్నాధ్, ఛార్మీలను ఈడీ దర్యాప్తు