Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్‌లో సీతగా అనుష్క.. నిజమేనా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:02 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్‌. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. 
 
అంతేకాకుండా.. రావణుడు పాత్రకు ఎవర్ని సెలెక్ట్ చేస్తారా..? అని అనుకుంటుంటే... బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్‌ను ఎంపిక చేశారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ రాముడు అయితే.. సీత ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే... అందాల అనుష్క సీతగా నటించనున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది.
 
ఎప్పుడైతే... సీత పాత్ర కోసం అనుష్క పేరు పరిశీలిస్తున్నారన్న వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు స్టార్ట్ అయ్యాయి. బాహుబలిలో ప్రభాస్-అనుష్క జంటకు మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి సీత పాత్రకు అనుష్కను ఎంచుకోవడం ఖాయం అనుకున్నారు. 
 
అయితే ఆదిపురుష్‌లో అనుష్క అనే వార్తపై తొలిసారి అనుష్క స్పందించింది. నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో అనుష్కను ఆదిపురుష్‌ మూవీలో నటిస్తున్నారా..? అని అడిగితే... అసలు విషయం బయటపెట్టింది.
 
ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే... ఆదిపురుష్ నేను నటిస్తున్నట్టు వచ్చిన వార్తల గురించి తెలిసింది. అయితే... ఆదిపురుష్‌‌లో నటించమని నన్నెవరూ అడగలేదు. అలాంటి ప్రతిపాదన ఏదీ తన దగ్గరకు రాలేదు అని క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments