Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (20:12 IST)
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కువగా చర్చలో ఉన్న టాపిక్ ఇదే. ప్రభాస్ డైరెక్టుగా నటిస్తున్న హిందీ చిత్రం ఆదిపురుష్ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా మీడియాలో కూడా ఇదే టాపిక్. సీత పాత్రలో మొదట్లో కీర్తి సురేశ్, తర్వాత కియారా అద్వానీ, ఆ తర్వాత ఊర్వశీ రౌటేలా.. ఇలా పలువురి పేర్లు వినిపించాయి.
 
ఇప్పుడు తాజాగా అనుష్క శర్మ పేరు వినబడుతుంది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందించే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే సీత పాత్ర విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అనుష్క శర్మ దాదాపు ఖరారైందని అంటున్నారు.
 
బాలీవుడ్ మీడియా కూడా దాదాపు ఇదే నిజమని అంటోంది. అనుష్క ఇటీవల దర్శకుడు ఓం రౌత్ కలిసి కథ, ఆమె పాత్ర గురించి వివరించి చెప్పాడని, ఆమె అందుకు హ్యాపీగా ఒప్పుకుందని అంటున్నారు. అయితే అనుష్క ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా ఆమె ఎలా ఒప్పుకొని ఉంటుందనే సందేహం మనకు రావడం సహజం. అది నిజమే. అనుష్కకు జనవరిలో డెలివరీ అవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కోహ్లీ ప్రకటించాడు.
 
ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా జనవరిలోనే మొదలవుతుంది. ముందుగా ప్రభాస్ ఇతర తారాగణంపై సన్నివేశాల భాగాన్ని పూర్తిచేస్తాడు. డెలివరీ అయిన రెండు నెలల తర్వాత తను షూటింగ్ రెడీ అయిపోతానని అనుష్క చెప్పిందట. అనుష్క కూడా పొడగరే కాబట్టి ప్రభాస్ పక్కన సరిగ్గా సూటవుతుందని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments