Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్స్ కావాలంటే 'ఆ' పని చేయమన్నాడు... సాజిద్ ఖాన్‌పై పాలా ఆరోపణలు

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (18:56 IST)
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై ప్రముఖ మోడల్ పాలా సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు తాను ఎదుర్కొన్న వేధింపులపై తాజాగా ఆమె నోరు విప్పింది. ఇందులో దర్శకుడు సాజిద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించింది. సినిమాల్లో నటించే అవకాశం కావాలంటే తన ముందు దుస్తులు విప్పేయాలని ఆయన ఒత్తిడి చేశాడని పేర్కొంది. ఈ వేధింపులన్నీ 17 యేళ్ల ప్రాయంలోనే అనుభవించినట్టు ఆమె వెల్లడించింది. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, 'మీటూ ఉద్యమం' జరిగే సమయంలో చాలా మంది అమ్మాయిలు సాజిద్ ఖాన్ వేధించాడ‌ని ఆరోపించారు. కానీ నేను చెప్పే ధైర్యం చేయ‌లేకపోయాను. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన యాక్ట‌ర్ల‌లో నేను కూడా ఒక‌రిని. కుటుంబ‌ స‌భ్యుల‌ను పోషించే బాధ్య‌త నాపై ఉండ‌టంతో మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. 
 
ముఖ్యంగా, 17 ఏళ్ల ప్రాయంలో ఉన్న‌పుడు సాజిద్ ఖాన్ నన్ను తాకేందుకు ప్ర‌య‌త్నించాడు. 'హౌస్‌ఫుల్‌'లో న‌టించే అవ‌కాశం ఇవ్వాలంటే.. త‌న ముందు దుస్తులు విప్పాల‌ని అడిగాడు. సాజిద్ ఇలా ఎంత‌మంది అమ్మాయిల‌తో ప్ర‌వ‌ర్తించాడో ఆ దేవుడికే తెలియాలి. 
 
సానుభూతి కోసం ఈ విషయాలు ఇపుడు వెల్లడించడం లేదన్నారు. ఇలాంటి క్రూర‌మైన స్వ‌భావ‌మున్న వ్య‌క్తులు క‌టాక‌టాల్లోకి పంపించాలని పాలా డిమాండ్ చేసింది. కాగా మోడల్ పాలా చేసిన ఆరోపణలు ఇపుడు బి టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments