Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎక్కువ మార్కులు ఎవరికి?

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎవరికి మార్కులొస్తాయని.. నెటిజన్లు బెట్ కడుతున్నారు. ఇంతకీ.. అనుష్క, నయనను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఎందుకు బెట్ కడుతున్నారంటే.. వీరిద్దరూ కలెక్టర్ రోల్స్ చేస్తున్నారట. తమి

Anushka Shetty
Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (11:48 IST)
నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎవరికి మార్కులొస్తాయని.. నెటిజన్లు బెట్ కడుతున్నారు. ఇంతకీ.. అనుష్క, నయనను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఎందుకు బెట్ కడుతున్నారంటే.. వీరిద్దరూ కలెక్టర్ రోల్స్ చేస్తున్నారట. తమిళంలో నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను అక్కడి ప్రజలు ఆమెకి నీరాజనాలు పడుతుంటారు. అలాంటి నయనతార తమిళంలో 'అరమ్' సినిమా చేసింది. 
 
ఈ నెల 10వ తేదీన భారీస్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో నయనతార కలెక్టర్ పాత్రలో కనిపించనుంది. లేడీస్ సూపర్ స్టార్‌గా నయనతారకు ఈ సినిమా రిలీజ్‌కు ముందే అగ్ర హీరోలకు పెట్టే కటౌట్లు నయనకు పెట్టారు. కలెక్టర్‌గా నయన ఇందులో అదరగొట్టేసిందని ప్రివ్యూ టాక్ చెప్తోంది. మరోవైపు.. ఈ చిత్రంలో తెలుగులో 'కర్తవ్యం' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇక తెలుగులో అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాలో, అనుష్క కూడా కలెక్టర్ పాత్రలో కనిపించనుంది. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళంలోను సంక్రాంతికి విడుదల కానుంది. కలెక్టర్లుగా నటించే ఈ ఇద్దరు కథానాయికలలో ఎవరు ఎక్కువ మార్కులు కొట్టేస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments