Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగమతిగా అనుష్క... ఫస్ట్ లుక్ రిలీజ్.. చేతిలో మేకు కొట్టుకుని.. (ఫోటో)

అరుంధతి వంటి సినిమాల ద్వారా లేడి ఓరియెంటెడ్ రోల్స్‌తో అదరగొడుతున్న అనుష్క తాజా సినిమా భాగమతి. ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి 'పిల్ల జ

Advertiesment
భాగమతిగా అనుష్క... ఫస్ట్ లుక్ రిలీజ్.. చేతిలో మేకు కొట్టుకుని.. (ఫోటో)
, మంగళవారం, 7 నవంబరు 2017 (12:18 IST)
అరుంధతి వంటి సినిమాల ద్వారా లేడి ఓరియెంటెడ్ రోల్స్‌తో అదరగొడుతున్న అనుష్క తాజా సినిమా భాగమతి. ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.35-40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
 
ఇక నవంబర్ 7న (నేడు) అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని.. ఒక రోజు ముందే భాగమతి టీమ్ టెరిఫిక్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. పాడుబడిన బంగ్లాలో, మాసిపోయిన బట్టలతో, ఇష్టానుసారంగా వదిలేసిన జుట్టుతో అనుష్క ఎడమ చేతికి మేకు కొట్టుకుని.. కుడిచేతిలో సుత్తితో కనిపిస్తోంది. ఈ పోస్టర్లో తనని తాను శిక్షించుకోవడం కనిపిస్తోంది. 
 
రాచరికపు స్త్రీకి చెందినవిగా కనిపిస్తోన్న రెండు కాళ్లు ఇనుప గొలుసులతో బంధించబడి ఇదే పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుందనేందుకు ఈ పోస్టరే నిదర్శనం. పోస్టర్‌ని చూస్తే అసలు కథ ఏమై ఉంటుందా? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్.. త్రివిక్రమ్-పవన్ సినిమా తొలి సాంగ్ (వీడియో)